Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeఆటలు1804 పీఈటీ పోస్టులు మంజూరు చేయండి

1804 పీఈటీ పోస్టులు మంజూరు చేయండి

- Advertisement -

– రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పెటా టిఎస్‌ వినతి
హైదరాబాద్‌ :
రాష్ట్రంలో 4704 ఉన్నత పాఠశాలలు ఉండగా.. అందులో 1804 హైస్కూల్స్‌లో వ్యాయామ విద్య ఉపాధ్యాయుల పోస్టులను మంజూరు చేయలేదని, క్రీడాభివద్దిని గమనంలో ఉంచుకుని తక్షణమే 1804 ఉన్నత పాఠశాలల్లో పీఈటీ పోస్టులను మంజూరు చేసి రానున్న డిఎస్సీలో భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యాయాయ విద్య ఉపాధ్యాయ సంఘం తెలంగాణ (పెటా టిఎస్‌) కోరింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకష్ణారావుకు పెటా టిఎస్‌ అధ్యక్ష, కార్యదర్శులు రాఘవరెడ్డి, కష్ణమూర్తి గౌడ్‌లు వినతి పత్రం అందజేశారు. ‘ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. స్పోర్ట్స్‌ పాలసీలో భాగంగా క్రీడా అకాడమీలు, స్పోర్ట్స్‌ యూనివర్శిటీలు ఏర్పాటు చేస్తున్నాం. పాఠశాల స్థాయిలో క్రీడలను బలోపేతం చేసేందుకు పీఈటీలను నియమిస్తాం. 1804 హైస్కూల్స్‌లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పోస్టులను మంజూరు చేస్తామని’ పెటా టిఎస్‌ నేతలతో సీఎస్‌ రామకష్టారావు అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్‌ రెడ్డితో కలిసి పెటా టిఎస్‌ నేతలు రేవంత్‌ రెడ్డి స్పెషల్‌ సెక్రటరీ అజిత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి.. రాష్ట్ర ప్రభుత్వం నూతన స్పోర్ట్స్‌ పాలసీ ఆమోదించినందుకు సీఎం రేవంత్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img