– యుఎస్‌ఏ జీఎంపై గెలుపు
– చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్
నవతెలంగాణ-చెన్నై : ప్రపంచ చెస్ వరల్డ్ నం.5, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగేశి చెన్నై చెస్ గ్రాండ్‌మాస్టర్స్‌లో శుభారంభం చేశాడు. టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న హౌటల్‌లో అగ్ని ప్రమాదం కారణంగా పోటీలు ఓ రోజు ఆలస్యంగా ఆరంభమైనా.. తెలంగాణ తేజం అర్జున్ ఎరిగేశి తొలి రౌండ్లో మెరుపు విజయం సాధించాడు. మాస్టర్స్ విభాగంలో యుఎస్‌ఏ గ్రాండ్‌మాస్టర్ లియాంగ్‌పై అర్జున్ విజయం సాధించాడు. 33వ ఎత్తులో గెలుపు దిశగా అడుగేసిన అర్జున్ అదే వ్యూహం కొనసాగించాడు. మరో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతీ తొలి రౌండ్‌ను డ్రా చేసుకున్నాడు. జోర్డెన్‌తో పాయింట్లను పంచుకున్నాడు. నిహాల్ సరిన్‌పై విన్సెంట్ కీమర్ విజయం సాధించాడు. అనిశ్ గిరి, రే రాబ్సన్‌లు తమ తొలి రౌండ్ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నారు. చాలెంజర్స్ విభాగంలో ద్రోణవల్లి హారిక నిరాశపరిచింది. తొలి రౌండ్లో ఘోష్ చేతిలో పరాజయం పాలైంది. ఐనియన్ పాతో మ్యాచ్‌ను ఆర్. వైశాలి డ్రా చేసుకుంది.
అర్జున్ శుభారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES