Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్ఎల్‌ఐసీ ఫలితాలు ఆకర్షణీయం

ఎల్‌ఐసీ ఫలితాలు ఆకర్షణీయం

- Advertisement -

– క్యూ1లో రూ.10,957 కోట్ల లాభాలు
ముంబయి :
దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 4 శాతం వృద్ధితో రూ.10,957 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.10,544 కోట్ల లాభాలు ప్రకటించింది. ఇదే సమయంలో రూ.1,14,230.23 కోట్ల నికర ప్రీమియం ఆదాయం చోటు చేసుకోగా.. గడిచిన క్యూ1లో 4.7 శాతం పెరిగి రూ.1,19,618.41 కోట్లకు చేరింది. కొత్త వ్యాపారం 20.75 శాతం పెరిగి రూ.1,944 కోట్లుగా నమోదయ్యింది. ”ఏడాదికేడాదితో పోల్చితే నూతన వ్యాపారం భారీగా పెరిగింది. మరోవైపు వ్యయ నిష్పత్తి 10.47 శాతం తగ్గింది.” అని ఎల్‌ఐసీ సీఈఓ, ఎండీ ఆర్‌ దొరైస్వామి తెలిపారు. 2025 జూన్‌ ముగింపు నాటికి ఎల్‌ఐసీ ఆస్తుల నిర్వహణ విలువ (ఏయూఎం) 6.47 శాతం పెరిగి రూ.57.05 లక్షల కోట్లకు చేరింది. భారత స్థూల బీమా వ్యాపారంలో 63.51 శాతం మార్కెట్‌ వాటాతో ఈ రంగంలో ఆధిక్యతను కలిగి ఉన్నట్లు ఎల్‌ఐసి వెల్లడించింది. గడిచిన జూన్‌ త్రైమాసికంలో కొత్తగా వ్యక్తిగత సెగ్మెంట్‌లో 30,39,709 పాలసీలను విక్రయించింది. గతేడాది ఇదే త్రైమాసికంలోని 35,65,519 పాలసీలతో పోల్చితే 14.75 శాతం పెరుగుదల నమోదయ్యిందని ఎల్‌ఐసీ తెలిపింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img