Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంపారదర్శకమైన మూల్యాంకన వ్యవస్థను రూపొందిస్తున్నాం

పారదర్శకమైన మూల్యాంకన వ్యవస్థను రూపొందిస్తున్నాం

- Advertisement -

పలు రాష్ట్ర ప్రభుత్వాలతో
ఎంఓయూ కుదుర్చుకున్నాం :
ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌
డాక్టర్‌ జి.నరేంద్ర కుమార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టుల మూల్యాంకనాన్ని బలపరిచే వ్యవస్థను రూపొందిస్తున్నామని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌, పంచాయతీరాజ్‌ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ జి.నరేంద్ర కుమార్‌ తెలిపారు. గురువారం రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌కు సంబంధించిన అధికారులు పలు రాష్ట్రాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల ప్రాజెక్టు మూల్యాంకన వ్యవస్థను పొందుపరిచేందుకు ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రాల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, జమ్మూ కాశ్మీర్‌, తమిళనాడు, కర్ణాటక, నాగాలాండ్‌, అస్సాం, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రతినిధులు కూడా పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ నరేంద్ర కుమార్‌ మాట్లాడుతూ.. ”ఈ అవగాహన ఒప్పందాల ద్వారా ప్రాజెక్ట్‌ మూల్యాంకన ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. పాల్గొన్న రాష్ట్రాల్లో గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయి” అని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులకు గుణాత్మక, పారదర్శక మూల్యాంకన వ్యవస్థను ఏర్పర్చడం అసరమని నొక్కి చెప్పారు. డీడీయూజీకేవై 2.0కు ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌ జాతీయ స్థాయి ప్రాజెక్టు అప్రైజల్‌ ఏజెన్సీగా పనిచేస్తుందని తెలిపారు. ప్రాజెక్టు అప్రపైజల్‌, ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌ డైరెక్టర్‌ సతీశ్‌కుమార్‌, ఎమ్‌ఓఆర్‌డీ అండర్‌ సెక్రటరీ(నైపుణ్యాలు) మేరీ థామస్‌, ఎంఓఆర్‌డీ మిషన్‌ మేనేజర్‌ శశి కుమార్‌ యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img