Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంగిరిజన సంక్షేమ టీచర్లకు పదోన్నతులివ్వాలి

గిరిజన సంక్షేమ టీచర్లకు పదోన్నతులివ్వాలి

- Advertisement -

– టీఎస్‌యూటీఎఫ్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలోని ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీల భర్తీ కోసం అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులను కల్పించేందుకు షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ వెంకట్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంలో గత నెలలోనే సంఘం పక్షాన ప్రాతినిధ్యం చేసిన సందర్భంలో రెండు, మూడు రోజుల్లో పదోన్నతుల షెడ్యూల్‌ ఇస్తామంటూ అధికారులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఒకవైపు పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలుగా హైస్కూళ్లలో సబ్జెక్టు టీచర్లు లేక విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు. మరోవైపు అర్హులైన ఉపాధ్యాయులు పదోన్నతుల్లేక రిటైర్డ్‌ అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో గిరిజన సంక్షేమ శాఖాధికారులు వెంటనే పదోన్నతుల షెడ్యూల్‌ విడుదల చేసి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మేలు చేయాలని కోరారు. అలాగే పాఠశాల విద్యాశాఖలో చేపట్టినట్టు ఆశ్రమ పాఠశాలల్లో కూడా భాషాపండితులు పీఈటీల పోస్టులను అప్‌గ్రేడ్‌ చేయాలని సూచించారు. అప్‌గ్రేడ్‌ పాఠశాలకు నూతన పోస్టులను మంజూరు చేయాలని తెలిపారు. ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలకు కంటిజెంట్‌ వర్కర్లను నియమించాలని పేర్కొన్నారు. సీఆర్టీల పెండింగ్‌ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించని పక్షంలో గిరిజన సంక్షేమ కమిషనర్‌ కార్యాలయం ముందు టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img