Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుభారత్‌పై అమెరికా ఆంక్షలు తగవు

భారత్‌పై అమెరికా ఆంక్షలు తగవు

- Advertisement -

– బీహార్‌ ఓట్ల తొలగింపు అప్రజాస్వామికం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
భారత్‌పై అమెరికా ఆంక్షలు తగవని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో గురువారం సీపీఐ(ఎం) జిల్లా విస్తృత స్థాయి సమావేశం కిల్లె గోపాల్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ ప్రారంభ ఉపన్యాసం చేశారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్‌.. రష్యా నుంచి భారతదేశం ఆయిల్‌ కొనుగోలు చేయరాదని ఆంక్షలు పెడుతూ 50 శాతం సుంకాల విధింపును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భారత్‌పై సుంకాలు ఇంకా పెంచుతానని ట్రంప్‌ బెదిరిస్తున్నారని, దేశ సార్వభౌమత్వంలో అమెరికా పెత్తనాన్ని సహించబోమని స్పష్టం చేశారు. దీనివల్ల వ్యవసాయం, ఫార్మా తదితర రంగాల్లో తీవ్ర సంక్షోభం ఏర్పడుతుందని, దీనిపై పార్లమెంట్‌లో ప్రధాని మోడీ చర్చించి విదేశాంగ విధానాన్ని స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అమెరికా పట్ల తన వైఖరిని వెల్లడించాలని తెలిపారు.
బీహార్‌ ఎన్నికల్లో 65 లక్షల ఓట్లను తొలగించి, ఇందులో ప్రతిపక్షాలు, మైనార్టీ ఓట్లను తొలగించడాన్ని జాన్‌వెస్లీ తీవ్రంగా ఖండించారు. ప్రధానంగా ఎస్సీ నియోజకవర్గాలు, మైనార్టీలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఓట్లు తొలగించారని, మళ్లీ ఎన్డీఏ కూటమి గెలవడానికి ఎలక్షన్‌ కమిషన్‌ను ఈ రకంగా ఉపయోగించుకుంటుందన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేసినా మోడీ ప్రభుత్వానికి కనువిప్పు కలవడం లేదన్నారు. ప్రజా సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కారానికి పోరాటాలు ఉధృతం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జయలకిë అన్నారు. సమస్య ఎక్కడుంటే కార్యకర్తలు అక్కడ ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.రాములు, నాయకులు నల్లవెల్లి కురుమూర్తి, వి.పద్మ, చంద్రకాంత్‌, రాజ్‌ కుమార్‌, మోహన్‌, జగన్‌, వేణుగోపాల్‌, ఆర్‌.రామ్‌రెడ్డి, వల్లభాపురం జనార్ధన్‌, కమర్‌ అలీ ఖాజా మైనుద్దీన్‌, ఖయ్యూం, చంద్రమ్మ, నాగమణి పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img