నవతెలంగాణ -సుల్తాన్ బజార్
రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆధార్ ఆధారిత హాజరు విధానం (అబాస్) నుంచి ఫీల్డ్ సూపర్వైజర్ స్టాఫ్ కు మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య, వైద్య మహిళా సంక్షేమ సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సంఘం ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగినులు కోఠి డీఎంహెచ్ఎస్ క్యాంపస్ ఆవరణలోని రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్(సీఎఫ్ డబ్ల్యూ) కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సంఘం అధ్యక్షురాలు పి. మహాలమ్మ, ప్రధాన కార్యదర్శి కె.రమాదేవి మాట్లాడుతూ.. ఎంతో కాలంగా పని చేస్తున్న ఏఎన్ఎంలకు పదోన్నతులు కల్పించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఏళ్ల తరబడి ఒప్పంద పద్ధతిలో పని చేస్తున్న ఈసీ ఏఎన్ఎంల సర్వీసులను క్రమబద్ధీకరించాలన్నారు.
‘అబాస్’ నుంచి ఫీల్డ్ సూపర్వైజర్ స్టాఫ్ ను మినహాయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES