నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడితో..1960లో కుదుర్చుకున్న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తు భారత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలిసిందే. ఆ ఆంక్షలను జీర్ణించుకోలేని పాక్ నేతలు..భారత్ పై అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇటీవల ఈ ఒప్పందం నిలిపివేత పాక్ నేతలు పలుమార్లు భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాక్ మాజీ విదేశాంగ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ భిలావల్ భుట్టో జర్దారీ నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. సింధూనదిలో నీరు పారకపోతే.. రక్తం పారుతుందంటూ ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ నోరు పారేసుకున్నారు. సింధూ జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా ధ్వంసం చేస్తామంటూ అవాకులు చవాకులు పేలారు.
భారత్ ఏ నిర్మాణం చేపట్టినా ధ్వంసం చేస్తాం: పాక్ రక్షణ మంత్రి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES