హైదరాబాద్ : ఫ్రెష్‌వర్క్స్, ఎడ్యునెట్ ఫౌండేషన్ హైదరాబాద్‌లో వెనుకబడిన వర్గాలకు చెందిన 12వ తరగతి ఉత్తీర్ణ విద్యార్థుల కోసం అకాడమీ ఆఫ్ కెరీర్స్ ఇన్ టెక్నాలజీ అనే కొత్త టెక్ అకాడమీని ప్రారంభించాయి. ఈ కార్యక్రమం 1000 గంటల ఫుల్-స్టాక్ డెవలప్‌మెంట్, ప్రాజెక్ట్-ఆధారిత శిక్షణ, కెరీర్ సంసిద్ధతపై దష్టి సారిస్తుంది. మొదటి బ్యాచ్‌లో 30 మంది విద్యార్థులకు శిక్షణ అందించబడుతుంది, అర్హులైన వారికి ఆర్థిక సహాయం కూడా అందుబాటులో ఉంటుంది. భారతదేశ డిజిటల్ వద్ధికి అనుగుణంగా, ఈ కార్యక్రమం నైపుణ్యం కలిగిన, సమ్మిళిత టెక్ శ్రామికశక్తిని నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎడ్యునెట్ ఫౌండేషన్ చైర్మెన్ నగేష్ సింగ్ మాట్లాడుతూ, ఈ భాగస్వామ్యం విద్య ద్వారా జీవితాలను మార్చగల శక్తిపై నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని, విద్యార్థులకు నైపుణ్యాలతో పాటు మార్గదర్శనం అందించడమే లక్ష్యమని తెలిపారు