Thursday, September 25, 2025
E-PAPER
Homeబీజినెస్టారిఫ్‌లతో మార్కెట్ల తిరోగమనం

టారిఫ్‌లతో మార్కెట్ల తిరోగమనం

- Advertisement -

– 2020 నాటి స్థాయి వరస నష్టాలు
– సెన్సెక్స్‌765 పాయింట్ల పతనం
ముంబయి :
ట్రంప్‌ టారిఫ్‌లతో భారత మార్కెట్లు బెంబె లెత్తుతున్నాయి. వరుస నష్టాలతో ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి. మరోవైపు ఎఫ్‌ఐఐలు వరుసగా తరలిపోతున్నాయి. ఈనేపథ్యంలోనే శుక్రవారం సెషన్‌ లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఏకంగా 765.47 పాయింట్లు (0.95 శాతం) తగ్గి 79,857.79 కు పడిపోయింది. నిప్టీ 232.85 పాయింట్లు (0.95 శాతం) పతనమై 24,363.30 వద్ద ముగిసింది. దీంతో వరసగా ఆరవ వారం లోను నష్టాలు నమోదయ్యాయి. ఇది 2020 కోవిడ్‌ కాలం తర్వాత అత్యధిక వరస నష్టాల రికార్డు నమోదయ్యింది. భారత ఎగుమతులపై ట్రంప్‌ 50 శాతం సుంకాలను విధించడం ఇన్వెస్టర్ల ను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. వారాంతం సేషన్‌ లో రూ. 5 లక్షల కోట్ల సంపదఆవిరయ్యింది.
ఎన్టీపీసీ, టైటాన్‌, ట్రెంట్‌ సూచలు సానుకూలంగా నమోదయ్యాయి. భారతి ఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌, ఎంఅండ్‌ ఎం అధిక నష్టాలను చవి చూశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -