Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంబండివి అడ్డుగోలు మాటలు

బండివి అడ్డుగోలు మాటలు

- Advertisement -

– 48 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే కోర్టుకీడుస్తా
– కేంద్ర మంత్రికి కేటీఆర్‌ హెచ్చరిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
: ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంపై నిరాధార ఆరోపణలు చేస్తూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజరు అన్ని హద్దులు దాటారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే.తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మినిమం కామన్‌ సెన్స్‌ లేకుండా, వాస్తవాలను తెలుసుకోకుండా, అసంబద్ధమైన, దిగజారుడు, థర్డ్‌క్లాస్‌ ఆరోపణలు చేయడం సిగ్టుచేటన్నారు. చవకబారు పబ్లిసిటీ కోసం, మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ఇలాంటి అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. శుక్రవారంఈమేరకు కేటీఆర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. బండి సంజరు చేసిన ఆరోపణల్లో ఒక్క శాతం నిజమున్నా నిరూపించాలని సవాల్‌ విసిరారు. తక్షణమే ఆ ఆరోపణలను ఉపసంహరించుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.ఆయనకు లీగల్‌ నోటీస్‌ పంపిస్తున్నట్టు తెలిపారు. ఈ డిమాండ్‌ను పట్టించుకోకపోతే 48 గంటల గడువు తర్వాత బండి సంజరుని కోర్టుకీస్తానని హెచ్చరించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ అనే అంశం ఎంత సున్నితమైనదో, చట్టపరంగా ఎంత కఠినమైనదో తెలవకుండానే వాస్తవాలను వక్రీకరిస్తున్నారని విమర్శించారు.సాక్ష్యం కూడా లేకుండా తమపై ఆరోపణలు చేయడం ఆయన రాజకీయ దిగజారుతున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజరుకి నిఘా వ్యవస్థల పని తీరు, విధానాలపై కనీస అవగాహన, పరిజ్ఞానం, ఇంగిత జ్ఞానం కూడా లేదని చురకలాంటించారు. కేంద్ర మంత్రిగా పని చేయడమంటే, ఢిల్లీ బాసులకు చెప్పులు మోసినంత ఈజీ కాదని చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img