Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంనిండుకుండల్లా జంట జలాశయాలు

నిండుకుండల్లా జంట జలాశయాలు

- Advertisement -

– మూసీ పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తం
-హిమాయత్‌సాగర్‌ నాలుగు గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల
నవతెలంగాణ-సిటీబ్యూరో
: వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట) జలాశయాలకు వరద నీరు భారీగా చేరుతోంది. నీటి మట్టం పెరగడంతో అప్రమత్తమైన అధికారులు గురువారం రాత్రి హిమాయత్‌సాగర్‌ రిజర్వాయర్‌ ఒక గేటును అడుగు మేర ఎత్తారు. శుక్రవారం ఉదయం మరో మూడు గేట్లను ఎత్తిన అధికారులు హిమాయత్‌సాగర్‌ రిజర్వాయర్‌ నుంచి దాదాపు 1391 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి వదిలారు. హిమాయత్‌సాగర్‌కు 1300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరింది. హిమా యత్‌సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 1763.50 అడు గులు కాగా, ప్రస్తు తం 1763.30 అడుగులకు చేరింది. ఉస్మాన్‌సాగర్‌కు 400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. ఉస్మాన్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1783 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ఉస్మాన్‌సాగర్‌ పూర్తిగా నిండే అవకాశముంది. ఈ క్రమంలో మూసీ నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ఇదిలావుండగా, హుస్సేన్‌సాగర్‌(ట్యాంక్‌ బండ్‌) ఎఫ్‌టీఎల్‌ లెవల్‌ 514.75 మీటర్లు కాగా, ప్రస్తుతం 513.63 మీటర్ల వరకు నీరు నిల్వ ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img