Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంవైద్యవిధాన పరిషత్‌లో ఉద్యోగం

వైద్యవిధాన పరిషత్‌లో ఉద్యోగం

- Advertisement -

జీతాల కోసం ఎదురుచూపులు
నెలల తరబడి పెండింగ్‌
ఆర్థిక ఇబ్బందుల్లో సిబ్బంది
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

వైద్య విధాన పరిషత్‌ లో ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనాలు నెలల తరబడి పెండింగ్‌ ఉంటున్నాయి. దీంతో ఈ విభాగంలో పని చేసే వేలాది మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రతి నెలా జీతం ఆలస్యం కావడం, దీంతో ఉద్యోగ సంఘాల నేతలు ఉన్నతా ధికారులను కలిసి విన్నవించడం పరిపాటిగా మారింది. నెల గడవగానే వేతన జీవులు చెల్లించాల్సిన బాకీలు ముందుకొచ్చి పడుతుంటాయి. ఇంటి అద్దెలు, పిల్లల ఫీజలు, రోజువారి ఇంటి ఖర్చులు తదితరాలు అదనం. ఇక బ్యాంకులు, ఇతరత్రా ఈఎంఐ కట్టే వారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతున్నది. పండుగలకు కూడా జీతాల్లేకుండా గడపాల్సి వస్తున్నదని వారు ఆవేదన చెందుతున్నారు. తమ జీతాలను ఏ నెలకు ఆ నెల వచ్చేలా చూడాలని ఉద్యోగులు కోరుతున్నారు.
తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిధిలో 156 ప్రభుత్వాస్పత్రు లున్నాయి. వీటిలో 1,369 మంది డాక్టర్లు, 2,995 మంది నర్సింగ్‌ ఆఫీసర్లు, మరో 3 వేల మంది నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ గ్రేడ్‌ వన్‌, గ్రేడ్‌ టు, సీనియర్‌ నర్సింగ్‌ ఆఫీసర్లు, పారా మెడికల్‌ సిబ్బంది, నాలుగో తరగతి సిబ్బంది పని చేస్తున్నారు. వీరే కాకుండా కాంట్రాక్టర్‌ అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన మరో 3 వేల మంది శానిటేషన్‌లో ఉన్నారు. మొత్తంగా ప్రతి రోజు 10,500 మందికి పైగా 150కి పైగా ఆస్పత్రుల్లో రోగులకు సేవలందిస్తున్నారు. ఈ విభాగంలో రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది కూడా భారీ స్థాయిలో ఉన్నారు. ఎప్పుడో ఒకసారి తప్పితే చాలాసార్లు ప్రతి నెల జీతం ఆలస్యం గా ఇవ్వడం లేదా నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నది. కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వచ్చే వేతనమే తక్కువగా ఉంటే వారికి తరచూ 3 నెలల జీతం పెండింగ్‌లో ఉంటున్నట్టు ఉద్యోగులు చెబుతున్నారు. పారామెడికల్‌ విభాగంలో ఎక్కువగా నాలుగో తరగతి ఉద్యోగులు అవుట్‌ సోర్సింగ్‌లో పని చేస్తుండగా వారికి కూడా 3 నెలలు బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. శానిటేషన్‌ విభాగంలోనైతే ఏకంగా 6 నెలల పెండింగ్‌ పెడుతున్నారు. ఈ విభాగంలో పేషెంట్‌ కేర్‌, సెక్యూరిటీ గార్డ్స్‌, శానిటేషన్‌ సిబ్బంది పని చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఏ నెల జీతం అదే నెల ఇప్పించాలనీ,, పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
010 పద్దు ద్వారా శాలరీ చెల్లించాలి : బైరపాక శ్రీనివాస్‌
వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగుల అన్ని సమస్యలకు 010 పద్దు ద్వారా శాలరీ చెల్లించడమే పరిష్కారమని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీయుఎంహెచ్‌ఇయూ-సీఐటీయూ అనుబంధం) వైద్య విధాన పరిషత్‌ విభాగం కార్యదర్శి బైరపాక శ్రీనివాస్‌ తెలిపారు. కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌, శానిటేషన్‌ సిబ్బందికి గుత్తెదారుల ద్వారా కాకుండా ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని సూచించారు. జీతాలు సమయానికి రాక పండుగలకు కూడా పస్తులేనా అన్నట్టుగా ఉద్యోగుల పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకోసం ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img