Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంమతం పేరుతో రిజర్వేషన్లను అడ్డుకోవద్దు

మతం పేరుతో రిజర్వేషన్లను అడ్డుకోవద్దు

- Advertisement -

మంత్రి పొన్నం ప్రభాకర్‌
తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీసీ సెల్‌ ప్రారంభించిన మంత్రి
నవతెలంగాణ-రాజేంద్రనగ
ర్‌
మతం పేరుతో రిజర్వేషన్లను అడ్డుకోవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్ని రాజకీయ పార్టీలకూ విజ్ఞప్తి చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల తీర్మానం చేశామని, అందులో మతపరమైన రిజర్వేషన్‌కు స్థానం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో నూతనంగా బీసీ సెల్‌ను రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యూనివర్సిటీ లో బీసీ సెల్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. బీసీలు ఒక్క గొంతుక కావాలని పిలుపు నిచ్చారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీసీ సెల్‌ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరినా గత పాలకులు అడ్డు కాలు చేశారన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3,4 ప్రకారం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. వ్యవసాయానికి, వ్యవసాయ విశ్వ విద్యాలయ భద్రతకు తమ ప్రభుత్వం ప్రాము ఖ్యత ఇస్తుందని తెలిపారు.
సిడ్నీ విశ్వ విద్యాలయంతో సంప్రదింపులు, ఒప్పంద ప్రక్రియకు ప్రభుత్వపరంగా సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. వీసీ అల్దాస్‌ జానయ్య నేతృత్వంలో ప్రవేశపెట్టిన నూతన కోర్సులకు, విదేశీ విద్య అభ్యసించేందుకు ఆర్థిక చేయూతని స్తామన్నారు. అలాగే రాష్ట్రంలో అన్ని వ్యవసాయ కళాశాలల వద్ద విద్యార్థులు, సిబ్బందికి రవాణా సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను ఆయా సమయాల్లో అందుబాటులో తిరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీసీ విభాగ అభివృద్ధికి ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్‌ తన నిధుల నుంచి రూ. 10 లక్షలు మంజూరు చేసినట్టు చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు ఒక బీసీ బిడ్డగా ప్రధాని, కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషన్‌ చైర్మెన్‌ టి.నిరంజన్‌, వీసీ జానయ్య, బీసీ సెల్‌ ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ దామోదరరాజు, బీసీ బోధనేతర సిబ్బంది, నాయకులు భిక్షపతి, విద్యార్ధులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img