Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంకార్మిక హక్కులపై అలసత్వం

కార్మిక హక్కులపై అలసత్వం

- Advertisement -


– తాగునీరు కరువు.. టారులెట్లు ఉండవు
– పార్కింగ్‌ స్థలం కూడా లేక పోలీసుల నుంచి వేధింపులు
– వర్కర్ల ఇబ్బందులు
– క్విక్‌ డెలివరీ యాప్‌ల తీరుపై తాజా సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ : దేశంలోని క్విక్‌ డెలివరీ యాప్‌లు కార్మికుల హక్కుల పట్ల అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. సదరు కంపెనీల గిడ్డంగుల్లో కార్మికుల కోసం కనీస సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలు కూడా లేవని ఓ సర్వేలో వెల్లడైంది. సీఐటీయూకు అనుబంధంగా ఉండే రాజధాని యాప్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఈ సర్వేను నిర్వహించింది. జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌)లో కొన్ని ప్రముఖ డెలివరీ యాప్‌లకు చెందిన 51 గిడ్డంగులను కవర్‌ చేస్తూ ఈ సర్వే జరిపారు. ఇక్కడ తాము ఎదుర్కొంటున్న పరిస్థితులను డెలివరీ బార్సు వివరించారు. ఈ సర్వే నివేదిక కార్మిక హక్కుల ఉల్లంఘనలను కనుగొన్నది. ఎన్‌సీఆర్‌లోని పలు వేర్‌హౌజ్‌లలో కార్మికుల కోసం కనీసం టారులెట్లు, స్వచ్ఛమైన నీరు, రెస్ట్‌ ఏరియా, ప్రథమ చికిత్స సౌకర్యాలు లేకపోవటాన్ని గుర్తించింది.
టారులెట్లు కూడా లేవు
ఓ క్విక్‌ డెలివరీ యాప్‌నకు గతంలో డెలివరీ ఏజెంట్‌గా పని చేసిన బ్రజేంద్ర సింగ్‌ తాను ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించాడు. ఢిల్లీలోని మాలవీయ నగర్‌లో గల కంపెనీ గిడ్డంగిలో టారులెట్‌ సౌకర్యం కూడా లేదని తెలిపాడు. ఇలాంటి పరిస్థితుల్లో పబ్లిక్‌ టారులెట్‌లను ఉపయోగించాల్సి వచ్చేదనీ, దీని కారణంగా డెలివరీకి ఆలస్యం ఏర్పడి తనకు వచ్చే ఇన్సెంటివ్‌లపై ప్రభావం పడేదని వివరించాడు. బ్రజేంద్ర సింగ్‌ మూడు నెలల క్రితమే తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ”మా స్టోర్‌లో టారులెట్‌ కూడా లేదు. నేను మా కంపెనీలో రెండేండ్లకు పైగా పని చేశాను. క్విక్‌ డెలివరీ యాప్‌ కంపెనీలు కార్మికుల కష్టాలు, బాధల గురించి పట్టించు కోవు. గిడ్డంగిలో 70 నుంచి 80 మంది రైడర్లు పని చేసేవారు. వారి వాహనాలను నిలపటం కోసం అక్కడ కనీసం పార్కింగ్‌ ఏరియా కూడా లేదు.” అని బ్రజేంద్ర తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
‘తాగునీటి సౌకర్యాన్నీ కల్పించరు’
గ్రీన్‌పార్క్‌లోని మా కంపెనీకి చెందిన గిడ్డంగిలో కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదని మరో యాప్‌నకు చెందిన ఓ డెలివరీ బారు చెప్పాడు. ”ఒక ఆర్డర్‌కు మాకు రూ.30 అందుతుంది. వారు (కంపెనీ యాజమాన్యం) మాకు తాగునీటి సౌకర్యాన్ని కూడా కల్పించరు. ఒక వాటర్‌ ప్యూరిఫైయర్‌ ఉన్నప్పటికీ.. అది అసలు పని చేయదు. రూ.15 పెట్టి ఒక వాటర్‌ బాటిల్‌ను మేము కొనగలమా? అలా అయితే మా సంపాదన సంగతేంటి?” అని పేరు చెప్పటానికి ఇష్టపడని డెలివరీ బారు వాపోయాడు. తమకు వైద్య సహాయానికి సంబంధించిన సౌకర్యం లేదనీ, రెస్ట్‌రూమ్‌గా ఉండే టిన్‌ షెడ్‌లో కనీసం ఒక కుర్చీ కూడా లేదని చెప్పాడు.
పార్కింగ్‌ సమస్య..
నిరుపయోగంగా ప్రథమ చికిత్స కిట్‌లు

గతనెల 2 నుంచి 15 మధ్య జరిపిన ఈ సర్వేలో కార్మికులు ఎదుర్కొంటున్న కఠిన పరిస్థితులు బహిర్గతమయ్యాయి. 28 శాతం వేర్‌హౌజ్‌లలో టారులెట్లు లేవు. 35 శాతం టారులెట్లు నీటి సదుపాయాన్ని కలిగి లేవు. ఫలితంగా ఇక్కడి కార్మికులు పబ్లిక్‌ టారులెట్లను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 14 శాతం గిడ్డంగులలో శుభ్రమైన తాగు నీరు లేదు. మూడోవంతు స్టోర్‌హౌజ్‌లలో కార్మికుల కోసం కూర్చోవటానికి ప్రత్యేకంగా ఎలాంటి స్థలమూ లేదు. ఇక 69 శాతం వేర్‌హౌజ్‌లలో ప్రథమ చికిత్స కిట్‌లు ఉన్నప్పటికీ.. చాలా వరకు లాక్‌ చేయబడి ఉన్నాయి. 40 శాతం స్టోర్‌హౌజ్‌లలో పార్కింగ్‌ సదుపాయాలు లేవు. ఫలితంగా కార్మికులకు పార్కింగ్‌ సమస్య ఏర్పడుతోందనీ, ఈ విషయంలో పోలీసుల నుంచి తాము వేధింపులను ఎదుర్కొన్నట్టు దాదాపు 37 శాతం మంది కార్మికులు వాపోయారు. యాజమాన్యం తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నదని 16 శాతం మంది వర్కర్లు తెలిపారు. 43 శాతం గిడ్డంగులలో కార్మికుల పట్ల ఉదాసీన వైఖరిని అక్కడి యాజమాన్యాలు ప్రదర్శిస్తున్నాయని సర్వేలో వెల్లడైంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img