జెనీవా : గాజాను స్వాధీనం చేసుకోవాలనే ఇజ్రాయిల్ ప్రభుత్వ ప్రణాళికను వెంటనే విరమించుకోవాలని యూఎన్ మానవహక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ శుక్రవారం హెచ్చరించారు. ఇజ్రాయిల్ తన ఆక్రమణను వీలైనంత త్వరగా నిలిపివేయాలని అన్నారు. ఈ ప్రణాళిక రెండు దేశాల పరిష్కారం , పాలస్తీనియన్ల స్వయం నిర్ణయాధికార హక్కును సాధించాలనే తీర్పునకు విరుద్ధంగా ఉందని టర్క్ పేర్కొన్నారు. పూర్తి అడ్డంకులు లేని మానవతా సాయం పంపిణీని గాజాలోకి అనుమతించాలని స్పష్టం చేశారు. హమాస్ బేషరతుగా బంధీలను విడుదల చేయాలని, ఇజ్రాయిల్ కూడా ఏకపక్షంగా నిర్బంధించిన పాలస్తీనియన్లను వెంటనే విడుదల చేయాలని అన్నారు. హమాస్‌ను ఓడించేందుకు ప్రణాళిక ప్రకారం గాజాను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ఇజ్రాయిల్ సైన్యం సిద్ధమవుతోందని నెతన్యాహూ కార్యాలయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే యుద్ధ ప్రాంతాల వెలుపల ఉన్న ప్రజలకు మానవతా సాయం పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది.
ముమ్మాటికీ తప్పే: బ్రిటన్ ప్రధాని
దాదాపు 22 నెలలుగా ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గాజాను స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రూపొందించిన ప్రణాళికను తాజాగా ఆ దేశ సెక్యూరిటీ క్యాబినెట్ అమోదించింది. దీనిపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పందిస్తూ.. బెంజమిన్ నిర్ణయం ముమ్మాటికీ తప్పేవన్నారు. జెరూసలెం ప్రభుత్వం దీనిపై పున్ణ సమీక్షించాలని కోరారు. దీనివల్ల ఘర్షణలు మరింతగా పెరిగి, రక్తపాతానికి దారితీసే ప్రమాదం ఉందన్నారు.
ఆ ప్రణాళికను విరమించుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES