Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంబీసీ రిజర్వేషన్లకుపార్లమెంట్‌లోచట్టం చేయాలి

బీసీ రిజర్వేషన్లకుపార్లమెంట్‌లోచట్టం చేయాలి

- Advertisement -

రజక వృత్తిదారుల సంఘం డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంట్‌లో చట్టం చేయాలనీ, తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలనే ద్వంద వైఖరికి నిరసనగా బీసీలంతా పోరాడాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆ సంఘం కార్యాలయంలో ఆఫీసు బేరర్ల సమావేశాన్ని ఎదునూరి మదార్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని బీసీలకు 42శాతం అమలు ద్వారా విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆర్డినెన్స్‌ ద్వారా కేంద్రానికి పంపించిందని పేర్కొన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును ఆమోదించకుండా తాత్సారం చేస్తోందని విమర్శించారు. ఆ బిల్లుకు ఆమోదం తెలపకుండా కాలయాపన చేస్తూ బీసీలను వంచిస్తోందని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మోడీ బీసీ అంటూ చెబుతూ ఓట్లు దండుకునేందుకు ఓబీసీలను దేశవ్యాప్తంగా బీజేపీ మోసగించిందని విమర్శించారు. బిల్లును ఆమోదించి కేంద్రం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేరేషన్‌లో వివిధ వృత్తిదారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాల ని డిమాండ్‌ చేశారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నారపు వెంకటేశ్వర్లు, రాష్ట్ర సహాయ కార్యదర్శులు వడ్డెబోయిన వెంకటేష్‌, కంచర్ల కుమార్‌, మరియాల గోపాల్‌, పాయిరాల రాములు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img