Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంకాళేశ్వరం పూర్తి నివేదిక ఇవ్వండి

కాళేశ్వరం పూర్తి నివేదిక ఇవ్వండి

- Advertisement -

– సీఎస్‌కు హరీశ్‌రావు వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ సమర్పించిన పూర్తి నివేదికను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) రామకృష్ణా రావును మాజీ మంత్రి టి హరీశ్‌రావు కోరారు. శుక్రవారం ఆయన సచివాలయానికి వెళ్లి సీఎస్‌ను కలిశారు. జస్టిస్‌ ఘోష్‌ ఇచ్చిన 665 పేజీల నివేదిక ప్రతులను ఇవ్వాలని కోరుతూ..తన పేరుతోనూ, కేసీఆర్‌ పేరుతోనూ ఉన్న వేర్వేరు వినతి పత్రాలను అందజేశారు. అనంతరం వినతిపత్రాలు ఇచ్చినట్టు రశీదులు తీసుకున్నారు. హరీశ్‌రావు విజ్ఞప్తిని పరిశీలించి చెబుతామని సీఎస్‌ చెప్పినట్టు సమాచారం. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్‌, ముఠా గోపాల్‌, బండారు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ తదితరులు హరీశ్‌రావు వెంట ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img