Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంసబ్సిడీ సిలిండర్ల కుదింపు

సబ్సిడీ సిలిండర్ల కుదింపు

- Advertisement -

– 12 నుంచి తొమ్మిదికి తగ్గింపు : కేంద్రమంత్రివర్గం నిర్ణయం
– రూ.12 వేల కోట్లతో పీఎం ఉజ్వల యోజన
– ప్రపంచ బ్యాంక్‌ రుణంతో సాంకేత విద్యలో మెరిట్‌ పథకం

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో : గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్ల ధరలను అనుహ్యంగా పెంచిన కేంద్రం..ఇప్పుడు సామాన్యులకు ఇస్తున్న సబ్సిడీ సిలిండర్ల సంఖ్యలోనూ కోతపెట్టింది. వాటి సంఖ్యను 12 నుంచి తొమ్మిది సిలిండర్లకు కుదించింది.ఈ మేరకు కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. 2023 అక్టోబర్‌ నుంచి పీఎంయూవై లబ్దిదారులకు 14.2 కేజీల సిలిండర్‌కు రూ.300 చొప్పున ఏడాదికి 12 రీఫిల్స్‌ కు గాను సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది. అయితే తాజాగా కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం ప్రకారం 12 సిలిండర్ల నుంచి తొమ్మిది సిలిండర్లకు సబ్సిడీని తగ్గించింది. దీంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం నాడిక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత కేంద్ర మంత్రి వర్గం సమావేశం అయింది. అనంతరం నేషనల్‌ మీడియా సెంటర్‌ (ఎన్‌ఎంసీ)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు. ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన (పీఎంయూవై) వినియోగదారులకు 2025-26 ఏడాదికి గాను రూ.12,000 కోట్ల లక్షిత సబ్సిడీని కొనసాగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు. 14.2 కేజీల సిలిండర్‌కు రూ.300లకు చొప్పున ఏడాదికి తొమ్మిది రీఫిల్స్‌ వరకు ఇచ్చే సబ్సిడీని కొనసాగించాలని (5 కేజీల కనెక్షన్లకు దామాషా ప్రకారం లెక్కిస్తారు) నిర్ణయించినట్టు తెలిపారు. 2025 జులై 1 నాటికి నాటికి దేశవ్యాప్తంగా 10.33 కోట్ల పీఎంయూవై కనెక్షన్లు ఉన్నాయన్నారు.
గృహ వినియోగ ఎల్పీజీ నష్టాల భర్తీకి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు రూ.30 వేల కోట్లు
దేశంలో గృహ వినియోగానికి సంబంధించిన ఎల్పీజీ అమ్మకాల్లో అండర్‌-రికవరీలను ఎదుర్కొన్న మూడు ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ (ఐఓసీఎల్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌)లకు రూ.30,000 కోట్ల మేరకు నష్టపరిహారాన్ని ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అన్నారు. ప్రభుత్వ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ (ఓఎంసీ)లకు నష్టపరిహారాన్ని అందించే పనిని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ పూర్తి చేస్తుందని, ఈ పరిహారాన్ని 12 విడతలుగా చెల్లిస్తారని అన్నారు.
ప్రపంచ బ్యాంక్‌ రుణంతో సాంకేత విద్యలో మెరిట్‌ పథకం
సాంకేతిక విద్యలో బహుళ విభాగ విద్య, పరిశోధన మెరుగుదల (మెరిట్‌) పథకానికి రూ.4200 కోట్లతో బడ్జెట్‌ మద్దతును కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. 175 ఇంజనీరింగ్‌, 100 పాలిటెక్నిక్‌లతో కూడిన 275 సాంకేతిక విద్యా సంస్థల్లో ‘మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ఇన్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్స (మెరిట్‌) పథకాన్ని అమలు చేసే ప్రతిపాదనను ఆమోదించినట్టు తెలిపారు. జాతీయ విద్యా విధానం-2020కి అనుగుణం గా అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పాలిటెక్నిక్‌లను కవర్‌ చేసే సాంకేతిక విద్యలో నాణ్యత, సమానత్వం, పాలనను మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యమని అన్నారు. 2025-26 నుండి 2029-30 వరకు మొత్తం రూ.4,200 కోట్లతో కూడిన ఈ పథకానికి, ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా రూ.2100 కోట్లు తీసుకుంటున్నట్టు తెలిపారు. తమిళనాడులో రూ.2,157 కోట్లతో మరక్కనం – పుదుచ్చేరి (ఎన్‌హెచ్‌ 332 ఎ) నాలుగు లైన్ల హైవే నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లో ప్రత్యేక అభివద్ధి కార్యక్రమాల (ఎస్‌డిపి) కింద నాలుగు కొత్త కార్యక్రమాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, దీనికోసం మొత్తం వ్యయం రూ.4,250 కోట్లు ఖర్చు చేయనుందని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img