– ట్రంప్ టారిఫ్‌లపై మూడీస్ రేటింగ్స్ హెచ్చరిక
న్యూఢిల్లీ : భారత దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన అధిక సుంకాలు తయారీ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీయవచ్చని, ఆర్థిక వృద్ధిని నెమ్మదిస్తాయని మూడీస్ రేటింగ్స్ శుక్రవారం హెచ్చరించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందంటూ ట్రంప్ భారత్ దిగుమతు లపై అదనంగా 25శాతం సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. మార్చి 2026తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వాస్తవ జీడీపీ వృద్ధి ప్రస్తుతం అంచనా వేసిన 6.3 శాతంలో నుంచి సుమారు 0.3శాతం మందగించవచ్చని తెలిపింది. 2025 తర్వాత, ఇతర ఆసియా పసిఫిక్ దేశాలతో పోలిస్తే చాలా విస్తృతమైన టారిఫ్ అంతరం భారతదేశ తయారీ రంగాన్ని ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ వంటి అధిక విలువ కలిగిన రంగాలను అభివృద్ధి చేయాలనే ఆశయానికి తీవ్రంగా నష్టం కలిగిస్తుందని పేర్కొంది. ఆయా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంలో గతకొన్నేండ్లుగా సాధిం చిన కొన్ని లాభాలను కూడా తగ్గించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
సుంకాల భారాన్ని తప్పించుకునేందుకు రష్యా చమురు దిగుమతుల ను తగ్గిస్తే.. అదే స్థాయిలో చమురు దిగుమతులను పొందడం భారత్‌కు కష్టతరం అవుతుందని కూడా సూచించింది. పెట్టుబడుల ప్రవాహాలకు ఆటంకం ఏర్పడటంతో దిగుమతుల విలువ పెరిగి లోటు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ రెండు అంశాల దృష్ట్యా చర్చలతో పరిష్కారం లభించే అవకాశం ఉందని భావిస్తున్నామని మూడీస్ తెలిపింది.
భారత తయారీ రంగానికి దెబ్బే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES