Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుశ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి 83,242 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, శ్రీశైలం నుంచి ఔట్‌ఫ్లో 98,676 క్యూసెక్కులుగా నమోదైంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 35 వేల క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడి గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 28,361 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 878.90 అడుగులుగా నమోదైంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 182.21 టీఎంసీలుగా నమోదై ఉంది. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img