Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఎంపీ రఘునందన్‌కు మరోసారి బెదిరింపు

ఎంపీ రఘునందన్‌కు మరోసారి బెదిరింపు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి హత్య బెదిరింపు ఎదురైంది. ఇటీవలి కాలంలో ఆయనకు ఇలాంటి హెచ్చరిక రావడం ఇది ఆరోసారి కావడం గమనార్హం. శుక్రవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి, తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని, సాయంత్రంలోగా చంపేస్తానని తీవ్రంగా హెచ్చరించాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఎంపీ, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు కాల్ వచ్చిన ఫోన్ నంబర్‌ను కూడా పోలీసులకు అందజేశారు. ఎంపీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img