- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రెండ్రోజులుగా హైదరాబాద్ వాసులను భారీ వర్షాలు భయపెడుతున్నాయి. సాయంత్రమైతే చాలు.. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు నగరంలో జనజీవనం అస్తవ్యస్తమయింది. ఇక నేడు కూడా నగరానికి భారీ వర్షసూచన ఉన్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ ఎక్స్ లో తెలిపారు. రానున్న 2 గంటల్లో పటాన్ చెరు, లింగంపల్లి, బీరంగూడ, అమీన్ పూర్ ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు అలుముకుని భారీ వర్షం కురవవచ్చని అంచనా వేశారు. అలాగే మధ్యాహ్నం తర్వాత నగరమంతా మేఘాలు కమ్మి వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపారు. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనూ రాబోయే 2 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
- Advertisement -