నవతెలంగాణ -భువనగిరి: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని, మతోన్మాదానికి ప్రైవేటీకండకు వ్యతిరేకంగా యువతని అడుగు బిగించాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పేరబోయిన మహేందర్ విజ్ఞప్తి చేశారు. శనివారం అఖిల భారత యువజన సమైక్య (ఏఐవైఎఫ్) 66వ వార్షికోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం సిపిఐ ఆపీస్ వద్ద ఏఐవైఎప్ జండాను ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పేరబోయిన మహేందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… సమగ్ర యువజన విధానం కొరకు 1959 మే 3న డిల్లీలో ఆవిర్భవించిన సంఘం, దేశం కోసం ప్రాణార్పణ చేసిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొవాలన్నారు. యువజన హక్కుల సాధనకై సామాజిక అభివృద్ధికై పాటుపడుతూ యువజన ఉద్యమాల వేదికగా ముందుకు సాగుతుందన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు,అత్యాచారాలను అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు కల్లేపల్లి మహేందర్ ఏఐవైఎప్ నాయకులు అనంతుల నర్సింహ్మ,సత్యనారాయణ పేరబొయిన రాజేష్,ఉమేష్ పాల్గొన్నారు.
దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES