Friday, September 26, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమరోసారి అమెరికాలో కాల్పుల క‌ల‌క‌లం

మరోసారి అమెరికాలో కాల్పుల క‌ల‌క‌లం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మరోసారి అగ్రరాజ్యం అమెరికా లో కాల్పులు క‌ల‌క‌లం రేపాయి. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద ఓ దుండగుడు హఠాత్తుగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.

కాల్పుల ఘటనతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -