- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్, GHMC మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు విధుల్లో ఉండాలని, సెలవులు రద్దు చేయాలని మంత్రి ఆదేశించారు. వానాకాలం పూర్తయ్యే వరకు 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరం వర్షాల తాకిడి నుండి సురక్షితంగా ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు జారీ చేశారు.
- Advertisement -