నవతెలంగాణ-హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. 2019 అక్డోబర్‌లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్ కె.లక్ష్మణ్.. కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కమలాపూర్ పీఎస్‌లో నమోదైన కేసును కొట్టేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. హుజూర్‌నగర్‌లో 2021 ఉప ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. కొవిడ్, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి సమావేశం నిర్వహించారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు రేవంత్ రెడ్డిపై కమలాపూర్ పీఎస్‌లో కేసు నమోదైంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో పాటు పీఎస్‌లో ఫిర్యాదు చేసిన ఎన్నికల అధికారికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసింది.