- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని మేడ్చల్ పరిధిలోని ఓఆర్ఆర్‌పై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పారిశుద్ధ కార్మికులను ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా ఒడిశా వాసులుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -