నవతెలంగాణ-హైదరాబాద్: మరోసారి పాక్ మాటలతో కవ్వింపు చర్యలకు దిగుతోంది. తాజాగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారత్‌పై తన రెచ్చేగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ అణ్వాయుధ దేశమని.. మనం పతనమవుతున్నామనుకుంటే మనతో పాటు సగం ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తామన్నారు. ఈసారి భారతదేశం నుంచి ముప్పు ఎదురైతే మాత్రం ఇస్లామాబాద్ సగం ప్రపంచాన్ని నాశనం చేస్తోందని అగ్ర రాజ్యం అమెరికా వేదికగా భారత్‌ను మునీర్ హెచ్చరించాడు.
సింధు నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదని.. సింధు నదిపై భారతదేశం పెత్తనం చెలాయిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని బెదిరించాడు. భారతదేశం ఆనకట్టు నిర్మించేంత వరకు వేచి చూస్తామని.. ఆ తర్వాత 10 క్షిపణులతో నాశనం చేస్తామని హెచ్చరించాడు.
అయితే జూన్‌లో అమెరికాలో పర్యటించినప్పుడు ఓ కార్యక్రమంలో మునీర్ ప్రసంగిస్తూ భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా అవి వెలుగులోకి వచ్చాయి. వ్యాపారవేత్త, గౌరవ కాన్సుల్ అద్నాన్ అసద్.. ఫ్లోరిడాలోని టంపాలో నిర్వహించిన బ్లాక్-టై విందుకు మునీర్ హాజరై మాట్లాడాడు. ప్రసంగమంతా ఆద్యంతం భారత్‌ను లక్ష్యంగా చేసుకునే మాట్లాడినట్లు సమాచారం.