నవతెలంగాణ – హైదరాబాద్ : జీతాల్లో కోత విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో హైడ్రా మార్షల్స్ సోమవారం విధులు బహిష్కరించారు. దీంతో వర్షాల వేళ నగర వ్యాప్తంగా ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోయాయి. వెంటనే అప్రమత్తమైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ వారితో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. సుదీర్ఘ చర్చల అనంతరం రంగనాథ్ మాట్లాడుతూ.. హైడ్రాలో పనిచేసే ఎవరి జీతాలూ తగ్గించం అని స్పష్టమైన ప్రకటన చేశారు. హైడ్రా మార్షల్స్ జీతాలు ఇంకా పెరుగుతాయని గుడ్ న్యూస్ చెప్పారు. ఓవర్ టైమ్ అంశాన్ని పరిశీలిస్తామని ఈ సందర్భంగా రంగనాథ్ హామీ ఇచ్చారు. అనంతరం హైడ్రా మార్షల్స్ మాట్లాడుతూ.. తమ సమస్యలపై కమిషనర్ రంగనాథ్ సానుకూలంగా స్పందించారని అన్నారు. జీతాల విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారని తెలిపారు.
హైడ్రా మార్షల్స్ కు గుడ్ న్యూస్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES