నవతెలంగాణ-హైదరాబాద్: గాజాపై ఇజ్రాయిల్ సైన్యాలు భీకరదాడులకు తెగబడుతూ..భారీ స్థాయిలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. దీంతో గాజాలో రోజురోజుకు ఆకలి చావులతో పాటు అనేక ఇజ్రాయిల్ దాడులకు బలి అవుతున్నారు. ఈక్రమంలో యూరప్ దేశాల నుంచి పాలస్తీనాకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. అరబ్ దేశాలు కూడా పాలస్తీనా ఆథారిటీకి పాలన అప్పగించాలని, దాడులకు స్వస్తి చెప్పాలని హమాస్‌కు అల్టిమేటం జారీ చేశాయి.
ఇది వరకు యూకే, ఫ్రాన్స్ కూడా పాలస్తీనాను గుర్తించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దేశాల బాటలోనే తాజాగా ఆస్ట్రేలియా నడుస్తోంది. తాము కూడా పాలస్తీనా దేశాన్ని గుర్తించిన్నట్లు ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఇజ్రాయిల్, పాలస్తీనా దేశాల పరిష్కారంతో పాటు గాజాలో కాల్పుల విరమణ, బందీలను విడుదల చేయడం లక్ష్యంతో సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రవేశపెట్టబోయో తీర్మానికి తాము అనుకూలంగా ఓటు వేస్తామని, 1947 నుండి, ఆస్ట్రేలియా ఇజ్రాయెల్ ఉనికికి మద్దతు ఇస్తోందని, రెండు రాష్ట్రాలను పక్కపక్కనే ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిన UN కమిటీకి ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి ఎవాట్ అధ్యక్షత వహించారని అది పేర్కొంది. ఇజ్రాయెల్- పాలస్తీనాలను సృష్టించడానికి 181వ తీర్మానానికి మద్దతుగా ఐక్యరాజ్యసమితిలో చేయి ఎత్తిన మొదటి దేశం కూడా ఆస్ట్రేలియా నిలుస్తుందని ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఉద్ఘాటించారు.