నవతెలంగాణ- కరీంనగర్
కుక్కలను తప్పించబోయి ద్విచక్ర వాహనంపై నుండి పడి వెన్నుపూస విరిగిన ఒక నిరుపేద ఆటో డ్రైవర్‌కు డాక్టర్ బి.ఎన్.రావు ఫౌండేషన్ ఆర్థిక సహాయం అందించింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వెంకట్రావుపల్లికి చెందిన కనుకుంట కుమార్ (40) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గత ఆగస్టు 2న సొంత పనులపై ద్విచక్ర వాహనంపై పెద్దపల్లి వెళ్తుండగా మార్గమధ్యంలో కుక్కలు అడ్డు వచ్చాయి. వాటిని తప్పించబోయే క్రమంలో రోడ్డుపై పడిపోయి వెన్నుపూస విరిగింది. విషయం తెలుసుకున్న డాక్టర్ బి.ఎన్.రావు.. ప్రతిమ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితుడిని సోమవారం పరామర్శించి, తక్షణ సహాయం కింద రూ. 25 వేల చెక్కును కుమార్ భార్య భాగ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యూరో సర్జన్ డాక్టర్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
ఆపదలో ఉన్న ఆటో డ్రైవర్‌కు బీఎన్.రావు ఫౌండేషన్ ఆర్థిక సహాయం
- Advertisement -
- Advertisement -