నవతెలంగాణ-హైదరాబాద్: ఏఎస్ఐ లవకుమార్ డ్యూటీకి కేరళవాసులు ఫీదా అయ్యారు. త్రిస్సూర్ మెడికల్ కాలేజ్ నుండి జూబిలీ మిషన్ హాస్పిటల్‌కు ఎమెర్జెన్సీ పరిస్థితుల్లో ఉన్న రోగిని అంబులెన్స్ లో తరలిస్తున్నారు. అంబులెన్స్ ఓ జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంది. అంబులెన్స్ సైరన్ శబ్దం వినిపిస్తున్నప్పటికీ, రోడ్డుపై వాహనాల రద్దీ అధికంగా ఉండటం వల్ల ముందుకు కదలలేని స్థితిలో ఉంది. ఈక్రమంలో అక్కడే డ్యూటీలో ఉన్న ఏఎస్ఐ అపర్ణ లవకుమార్ పరిస్థితిని గమనించి వెంటనే తన వాహనం నుండి దిగి..అంబులెన్స్ కు దారి ఇవ్వలంటూ వాహనం ముందు పరుగెడుతూ..ట్రాఫిక్ క్లియర్ చేసింది.అయితే ఇదంతా అంబులెన్స్ సిబ్బందిలో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వీడియో వైరలైంది
కేరళ ఏఎస్ఐ డ్యూటీకీ నెటిజన్లు ఫీదా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES