నవతెలంగాణ-హైదరాబాద్: ఇండియా బ్లాక్ కూటమి ఎంపీలు కీలక భేటీ నిర్వహించారు. కాసేపట్లో ప్రారంభంకానున్న ఉభయసభల్లో వ్యవహరించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు విపక్షాల ఆందోళనలతో దద్దరిలుతున్నాయి. బీహార్‌లో ఎస్ఐఆర్ పేరుతో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ అంశంపై ఉభయసభల్లో చర్చ జరగాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి.
అదే విధంగా ఈసీ ఓట్ల చోరీ అంటూ ఇండియా బ్లాక్ కూటమి పార్టీలు ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాయాలనికి చేపట్టిన ర్యాలీలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీగా బయలు దేరిన ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో ఎంపీలకు, పోలీసలుకు మధ్య గర్షణ వాతావరణం నెలకొంది. ఈ తొపులాటలో పలువురు ఎంపీలు కిందపడిపోయారు. ప్రతిపక్షనేత రాహుల్ గాంధీతో పాటు మరికొంతమంది ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.