Monday, September 29, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఉద్యోగులకు హైదరాబాద్ పోలీసులు కీల‌క సూచన

ఉద్యోగులకు హైదరాబాద్ పోలీసులు కీల‌క సూచన

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇవ్వాళ భారీ వర్ష సూచన ఉందని, ఈ నేపధ్యంలో అత్యవసరం అయితేనే బయటకు రావాలని తెలంగాణ పోలీసులు అధికారిక ‘ఎక్స్’ వేదికగా నగరవాసులకు సూచించారు. మధ్యాహ్నం 3 గంటల్లోగా ఇళ్లకు చేరుకునేలా చూసుకోండని, సాయంత్రం షిఫ్ట్ ఉన్నవారు ఇంటి నుంచే పని చేసేలా ప్లాన్ చేసుకోగలరని పోలీసులు సూచించడం గమనార్హం. సిటీలో కొన్నిరోజులుగా పగలంతా ఎండ, రాత్రి వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగి, ప్రధాన రహదారులపై వరద నీరు నిలిచిపోతోంది. ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం కూడా ఇలాగే మోస్తరు వర్షం పడింది. మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలకు వరద నీరు వచ్చి చేరుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -