నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి ట్రస్ట్ ఛైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ శ్రీకారం చుట్టారు. ఆస్పత్రి నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, నారా బ్రహ్మణి, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తదితరులు పాల్గొన్నారు. నేలపాడు నుంచి అనంతవరం వెళ్లే ఈ-7 రహదారిని ఆనుకుని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మించనున్నారు. మొత్తం 21 ఎకరాల్లో ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టనున్నారు. మూడు దశల్లో ఆస్పత్రి నిర్మాణం జరగనుంది. తొలి దశలో 500 పడకల సామర్థ్యంతో విస్తృత శ్రేణి ఆంకాలజీ సేవలు అందిస్తారు. రూ. 750 కోట్ల పెట్టుబడితో మౌలిక సదుపాయాలు, అధునాతన పరికరాలను ఏర్పాటుచేస్తారు. రెండో దశలో పడకల స్థాయిని వెయ్యికి పెంచుతారు. 2028 నాటికి మొదటి దశ పనులు పూర్తి కానున్నాయి.
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి శంకుస్థాపన చేసిన బాలకృష్ణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES