నవతెలంగాణ-హైదరాబాద్: మరోసారి EPIC(ఎలక్ట్రోరల్ ఫొటో ఐడెంటి కార్డు)గుర్తింపు నెంబర్ల పై ఆర్జీడీ నేత తేజిస్వీ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సిన్హాకు రెండు EPIC నెంబర్లను ఈసీ జారీ చేసిందని ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి రాష్ట్రంలోని బీజేపీ నేతలందరికి రెండు EPIC నెంబర్లును ఉన్నాయని విమర్శించారు. ప్రతిపక్షాల ఓట్లను తగ్గించేందుకు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు.
“”మేము ఇంకో విషయాన్ని బయటపెడుతున్నాము. ముజఫపూర్ మేయర్, బీజేపీ నాయకురాలు, నిర్మలా దేవి, ఒకే విధాన సభలో ఆమెకు రెండు EPIC IDలు ఉన్నాయి. అందులో కూడా అవి భిన్నంగా ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, నిర్మలా దేవికి ఇద్దరు బావమరిది ఉన్నారు, వారికి రెండు EPIC నంబర్లు కూడా ఉన్నాయి” అని ఆయన పాట్నా మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సందర్భంగా బీహార్ ఓటర్ల జాబితాలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారి పేర్లను చేర్చుతున్నారని RJD నాయకుడు ఆరోపించారు. “ఇప్పుడు గుజరాత్ ప్రజలు బీహార్ ఓటర్లుగా మారుతున్నారు. బీజేపీకి బాధ్యత వహిస్తున్న భిఖుభాయ్ దల్సానియా పాట్నా ఓటరుగా మారారు. ఆయన 2024లో గుజరాత్‌లో తన చివరి ఓటు వేశారు, కానీ ఆయన ఇప్పటికీ పాట్నా ఓటరు. గుజరాత్‌లో ఆయన పేరును తొలగించారు, కానీ ఐదు సంవత్సరాలు కాలేదు, మీరు స్థలాలు మార్చడం, ఓటు వేయడం ప్రారంభించారని విమర్శించారు. బీహార్ ఎన్నికలు ముగిసిన తర్వాత, ఆయన పేరు తొలగించిన తర్వాత ఎక్కడికి వెళతారు?” యాదవ్ ప్రశ్నించారు.