- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఒలింపిక్ పతక విజేత, రెజ్లర్ సుశీల్ కుమార్‌కు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్‌కడ్ హత్య కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను రద్దు చేసి, వారం రోజుల్లో లొంగిపోవాలని ఆదేశించింది. సుశీల్ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని, వారిని బెదిరిస్తున్నారని మృతుడు సాగర్ తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో బెయిల్‌ను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
- Advertisement -