Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమించాలి..

క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమించాలి..

- Advertisement -

 ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి గోరేటి రాములు, ఎండీ ఇమ్రాన్ ..
నవతెలంగాణ – భువనగిరి

క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్మికులు తమ హక్కుల సాధన కోసం మరియు కార్మిక చట్టాల పరిరక్షణకై ఉద్యమించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గోరెటి రాములు ఎండీ ఇమ్రాన్  కోరారు. బుధవారం  కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు, రైతు సంఘాల పిలుపు మేరకు భువనగిరిలోని భారత రాజ్యాంగ నిర్మాత బి. ఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదురుగ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా  నిర్వహించారు. ఈ సందర్బంగా రాములు, ఇమ్రాన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలలో భాగంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ దేశంలో కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా చేస్తుందన్నారు. 

ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటుపరం చేసి కార్పొరేట్ శక్తులకు, అదాని, అంబానీ లాంటి బడా పెట్టుబడిదారుల ఆస్తులు పెంచి కార్మికులను నిరుపేదలగా మార్చే  ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని వారు ఆరోపించారు. పబ్లిక్ సెక్టార్, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలన్నారు. రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను, 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం ప్రతి కార్మికునికి రూ. 26 వేలు కనీస పెన్షన్ నెలకు రూ 5 వేలు ఇవ్వాలన్నారు. స్కీమ్ వర్కర్ లను క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని, మధ్యాహ్న భోజన వంట కార్మికులకు ప్రభుత్వమే వంట గ్యాస్ మరియి నిత్యవసర వస్తువులు సరఫరా చేయాలన్నారు. అసంఘటితరంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గనబోయిన వెంకటేష్, కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, జిల్లా కమిటీ సభ్యులు సామల భాస్కర్, పుట్ట రమేష్, ముంతాజ్ బేగం నాయకులు కాశపాక దయాకర్, గౌరవంతుల శ్రీనివాస్, మడుగుల స్వామి, బొజ్జ గణేష్, జహంగీర్, మల్లేష్, నరేష్,  బోయిని బిక్షపతి, నరసింహ,   పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad