- Advertisement -
- సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ. రాఘవులు
నవతెలంగాణ-హైదరాబాద్: ట్రంప్ సుంకాలతో భారత్ లోని పలు రంగాలపై పెను ప్రభావం పడనుందని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ. రాఘువులు అన్నారు. రానున్న రోజుల్లో ఐటీ, ఫార్మా రంగాలపై అధిక ప్రభావం చూపనుందని, ఫార్మాకు రంగానికి కేంద్రమైనా హైదరాబాద్‌పై ఆ ప్రభావం ఎక్కువగా ఉండనుందన్నారు. బుధవారం ఇండియాపై యూఎస్ అదనపు సుంకాలను విధించడాన్ని ఖండిస్తూ..సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఆర్‌టీస్ క్రాస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రష్యా చమురును కొనుగోలు చేస్తున్నారనే సాకుతో ఇండియాపై అదనపు సుంకాలు వేయడం దారుణమన్నారు. అమెరికా సుంకాల కారణంగా దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి పెను నష్టం వాటిల్లనుందని చెప్పారు. - ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని, ఆయా ఉత్పత్తులపై ఎంతమేర సుంకాల విధించారో ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో అమెరికా టారిఫ్‌లకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటితమై, పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. బుధవారం ఇండియాపై అదనపు సుంకాలను విధించడాన్ని ఖండిస్తూ..సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఆర్‌టీస్ క్రాస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, పార్టీశ్రేణులు పాల్గొన్నారు.

- Advertisement -