Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అధిక ధరలకు విక్రయిస్తున్నా విత్తనాలు, ఎరువులు

అధిక ధరలకు విక్రయిస్తున్నా విత్తనాలు, ఎరువులు

- Advertisement -

అన్నదాతలను నిలువునా ముంచుతున్నా ఎరువుల దుకాణ యజమానులు
తుతూ మంత్రాంగనే షాప్ లో తనిఖీలు
నవతెలంగాణ – కాటారం
ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు విత్తనాలు, ఎరువులను రైతులకు విక్రయిస్తున్నారు. బిల్లులు అడిగితే అమ్మేది ఓ ధరకు బిల్లులో మాత్రం మరో ధర రాసిస్తున్నారు. వివరాల్లోకి వెలితే..…. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగుల గూడెం గ్రామపంచాయతీ దేవరాంపల్లి గ్రామానికి చెందిన రాజ సమ్మయ్య అనే రైతు రాజరాజేశ్వర ఫర్టిలైజర్ ఎరువుల దుకాణంలో ఒక బస్తా యూరియా, నాలుగు బస్తాల డిఏపి ఎరువులను కొనుగోలు చేశాడు. యూరియా బస్తాకు 320 రూపాయలు తీసుకోగా, బిల్లులో మాత్రం 266 రూపాయలను రాసి ఇచ్చాడు. అంతేకాకుండా ఒక్కో డిఏపి బస్తాకు బిల్లులో 1450 రూపాయలు రాసి ఇచ్చి 1500 రూపాయలు వసూలు చేశాడని రైతు వాపోతున్నాడు. అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ, ఎరువుల దుకాణ యజమానులు మాత్రం రైతులను నట్టేట ముంచుతున్నారు.ఇదేంటని ప్రశ్నిస్తే హమాలీ చార్జీలు అదనంగా వసూలు చేస్తున్నామని పొంతననేని సమాధానాలు చెబుతున్నాడని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు ఎరువుల దుకాణంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad