Sunday, May 4, 2025
Homeఆటలురబాడపై 'మత్తు' సస్పెన్షన్‌

రబాడపై ‘మత్తు’ సస్పెన్షన్‌

- Advertisement -

– అందుకే ఐపీఎల్‌ నుంచి నిష్క్రమణ
న్యూఢిల్లీ:
దక్షిణాఫ్రికా స్టార్‌ పేసర్‌, ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున ఆడుతున్న కగిసో రబాడ నిషేధిత ఉత్పేరకం వాడిన అంశంలో సస్పెన్సన్‌ ఎదుర్కొంటున్నాడు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా క్రికెటర్ల అసోసియేషన్‌ ద్వారా కగిసో రబాడ శనివారం ఓ ప్రకటనలో తెలిపాడు. ఐపీఎల్‌లో టైటాన్స్‌ తరఫున రెండు మ్యాచులు ఆడిన రబాడ.. ఏప్రిల్‌ 3న స్వదేశానికి వెళ్లిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో రబాడ దక్షిణాఫ్రికాకు వెళ్లినట్టు టైటాన్స్‌ ప్రకటనలో తెలిపినా, వివరాలు వెల్లడించలేదు. ఈ ఏడాది ఆరంభంలో (జనవరి-ఫిబ్రవరి)లో జరిగిన ఎస్‌ఏ20లో ఎంఐ కేప్‌టౌన్‌ తరఫున బరిలో నిలిచిన కగిసో రబాడ.. టోర్నమెంట్‌ సమయంలో రబాడ తీసుకున్న ‘వినోదపు డ్రగ్‌’లో నిషేధిత ఉత్పేరకాల అవశేషాలు తేలాయి. ఈ ఉత్పేరకం ఆటగాడి ప్రదర్శనను ప్రభావితం చేయదు. అందుకే, రబాడ కేవలం నెల రోజుల నిషేధంతో బయటపడినట్టు సమాచారం!. మార్చి 29 నుంచి ఆటకు దూరంగా ఉన్న కగిసో రబాడ.. ఐపీఎల్‌లో ఆడేందుకు తిరిగి భారత్‌కు చేరుకున్నాడు. ఈ వారంలో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున రబాడ ఆడే అవకాశం కనిపిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -