‘రెండేళ్ళ క్రితం ఏఐ స్టూడియో ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది. ఈ క్రమంలో ‘క్వాంటమ్ ఏఐ’ను సంప్రదించాం. సినిమా పరంగా ఏఐ ఎంతగా ఉపయోగపడుతుందో చర్చించాం. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్.. ఇలా సినిమా నిర్మాణంలో ఏఐ భాగం కానుంది’ అని నిర్మాత దిల్ రాజు అన్నారు.
దిల్‌రాజుకి చెందిన ‘లార్వెన్ ఏఐ’ స్టూడియోను మంత్రి శ్రీధర్‌బాబు శనివారం ప్రారంభించారు. స్టూడియో లోగోను నిర్మాత అల్లు అరవింద్ ఆవిష్కరించారు. ఈ క్రార్యక్రమంలో రాఘవేంద్రరావు, సుకుమార్, అనిల్ రావిపూడి, వి.వి. వినాయక్, వంశీ పైడిపల్లి, శిరీష్ తదితరులు పాల్గొన్నారు.
‘మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న టెక్నాలజీని సినీ రంగంలోకి పరిచయం చేయాలనే దఢ సంకల్పంతో దిల్ రాజు ‘లోర్వెన్ ఏఐ’ స్టూడియోని లాంచ్ చేయడం అభినందనీయం. ఈ స్టూడియో ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను’ అని తెలంగాణ ఐటీ మినిస్టర్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చెప్పారు.
దిల్‌రాజు మాట్లాడుతూ, ‘ఏఐ గురించి గత రెండేళ్ల క్రితం డిస్కర్షన్ స్టార్ట్ చేశాం. మా కంపెనీ నుంచి స్టార్ట్ అయిన టీం, క్వాంటంతో కలసి సినిమా గురించి డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నాం. 360 డిగ్రీస్ సినిమాని ఎలా చేయొచ్చు అనేది క్రియేటీవ్‌గా డెవలప్ చేయడం జరిగింది. స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత చేసే ప్రీ ప్రొడక్షన్‌ని ఏఐలో ఎలా చేయొచ్చు అనేది చేయడం జరిగింది. అది చాలా మిరాకిల్‌గా అనిపిస్తుంది. చాలామంది డైరెక్టర్స్‌కి , ప్రొడ్యూసర్స్‌కి దీని గురించి చూపించడం జరిగింది. అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. వాళ్ళ అప్రిషియేషన్ ఒక ఎనర్జీని ఇచ్చింది. స్క్రిప్ట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రీ ప్రొడక్షన్‌లో మనం హౌమ్ థియేటర్‌లో విత్ సౌండ్ ఎఫెక్ట్స్‌తో సినిమా చూడొచ్చు. అది మెయిన్ టార్గెట్. సక్సెస్ పర్సెంటేజ్‌ని పెంచవచ్చు. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్‌లో డైరెక్టర్‌కి టైం సేవ్ అవుతుంది. టైమ్ సేవ్ అవ్వడం వల్ల దర్శకులు ఇంకా ఎక్కువ సినిమాలు తీస్తారు. అలాగే ప్రొడ్యూసర్స్‌కి టైం సేవ్ కావడం వల్ల మనీ సేవ్ అవుతుంది. మా స్టూడియో ఎమోషన్ లేని ఒక ఫస్ట్ ఏడి (అసిస్టెంట్ డైరెక్టర్)గా భావించవచ్చు. మా సంస్థలో విజరు దేవరకొండతో తీస్తున్న ‘రౌడీ జనార్ధన’ డైరెక్టర్ రవికిరణ్ ఇందులో వర్క్ చేస్తున్నాడు. తన స్క్రిప్టు ప్రీ ప్రొడక్షన్ ఇందులోనే జరుగుతుంది. అలాగే కొత్త వాళ్ళతో చేస్తున్న ‘తెల్ల కాగితం’ అనే సినిమా కూడా జరుగుతుంది. అలాగే ఒక విఎఫ్‌ఎక్స్ సినిమా చేయబోతున్నాం. దాని వర్క్ కూడా ఇందులోనే జరుగుతుంది. అలాగే ఒక స్క్రిప్ట్‌ని కూడా ఇందులోనే డెవలప్ చేస్తున్నాం. మా స్డూడియోని అందరికీ అందుబాటులోకి వచ్చేలా చేస్తాం’ అని చెప్పారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ,’ఈ సాప్ట్‌వేర్ యూజ్ చేయడానికి నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఇది క్రియేటివిటీని ఎన్హాన్స్ చేస్తుందని భావిస్తున్నాను’ అని చెప్పారు.
తెలుగు సినిమా స్థాయిని పెంచే ‘లార్వెన్ ఏఐ’ స్టూడియో
- Advertisement -
- Advertisement -