Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుబాలికపై లైంగికదాడి.. నిందితుడికి ఉరిశిక్ష వేసిన కోర్టు!

బాలికపై లైంగికదాడి.. నిందితుడికి ఉరిశిక్ష వేసిన కోర్టు!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మైనర్‌ బాలికపై లైంగికదాడి కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెల్ల‌డించింది. నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ న్యాయ‌స్థానం తీర్పునిచ్చింది. వివ‌రాల్లోకి వెళితే… 2013లో నల్గొండకు చెందిన మోహమ్మీ ముకర్రం అనే వ్య‌క్తి.. 12 ఏళ్ల‌ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. అదే అదునుగా ఆ మైన‌ర్ బాలిక‌పై అఘాయిత్యానికి ఒడిగ‌ట్టాడు. ఈ విష‌యాన్ని బాలిక ఎక్క‌డ బ‌య‌ట‌పెడుతుందోన‌ని ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేశాడు. నిందితుడు ముకర్రంను అరెస్టు చేసిన‌ నల్గొండ వన్‌టౌన్‌ పోలీసులు అత‌నిపై పోక్సో చట్టం, హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై గత పదేళ్లుగా జిల్లా కోర్టులో వాదనలు కొన‌సాగుతున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు పోక్సో కోర్టు ఇన్‌ఛార్జి న్యాయమూర్తి రోజా రమణి నిందితుడికి మ‌ర‌ణ‌శిక్ష‌ విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఉరిశిక్ష‌తో పాటు రూ.1.10 లక్షల జరిమానా కూడా విధించారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad