Sunday, May 4, 2025
Homeఆటలుచాంపియన్‌ సబలెంక

చాంపియన్‌ సబలెంక

- Advertisement -

– ఫైనల్లో కొకొ గాఫ్‌పై ఘన విజయం
– మాడ్రిడ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ 2025
మాడ్రిడ్‌ (స్పెయిన్‌):
మహిళల సింగిల్స్‌ ప్రపంచ నం.1, బెలారస్‌ భామ అరినా సబలెంక సూపర్‌ విక్టరీ సాధించింది. అదిరే ఆటతో మాడ్రిడ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ చాంపియన్‌గా నిలిచింది. నాల్గో సీడ్‌, అమెరికా యువ క్రీడాకారిణి కొకొ గాఫ్‌పై అరినా సబలెంక 6-3, 7-6(7-3)తో వరుస సెట్లలో మెరుపు విజయం సాధించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ టైటిల్‌ పోరులో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన సబలెంక స్థాయికి తగ్గ ప్రదర్శన చేసింది. తిరుగులేని విజయాలతో ఫైనల్‌కు చేరుకున్న కొకొ గాఫ్‌ అంతిమ పోరులో అదరగొడుతుందని అనుకున్నా.. వరల్డ్‌ నం.1 ముందు చేతులెత్తేసింది. 2 ఏస్‌లు, నాలుగు బ్రేక్‌ పాయింట్లతో మెరిసిన సబలెంక తొలి సెట్‌ను అలవోకగా గెల్చుకుంది. కానీ రెండో సెట్‌లో గాఫ్‌ తీవ్రంగా ప్రతిఘటించింది. ఒత్తిడికి గురైన గాఫ్‌ 8 డబుల్‌ ఫాల్ట్స్‌కు పాల్పడింది. రెండు బ్రేక్‌ పాయింట్లు మాత్రమే సాధించిన గాఫ్‌.. టైటిల్‌కు అడుగు దూరంలో ఆగిపోయింది. రెండో సెట్‌ను టైబ్రేకర్‌ వరకు తీసుకెళ్లినా.. ఉత్కంఠను తెరదించుతూ సబలెంక టైబ్రేకర్‌లో విజయం సాధించింది. పాయింట్ల పరంగా 81-61తో సబలెంక స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. ఓవరాల్‌గా సబలెంక 13 గేమ్‌ పాయింట్లు సాధించగా, గాఫ్‌ 9 గేమ్‌ పాయింట్లతోనే సరిపెట్టుకుంది. నేడు జరిగే పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో కాస్పర్‌ రూడ్‌, జాక్‌ డ్రేపర్‌ తలపడనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -