Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంపుతిన్‌తో చర్చలు విఫలమైతే...

పుతిన్‌తో చర్చలు విఫలమైతే…

- Advertisement -

భారత్‌పై మరిన్ని సుంకాలు : అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెస్సెంట్‌
వాషింగ్టన్‌:
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మధ్య శుక్రవారం అలాస్కాలో జరగనున్న చర్చలు విఫలమైతే భారత్‌పై అదనంగా మరోసారి అమెరికా ప్రభుత్వం సుంకాలు విధిస్తుందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెస్సెంట్‌ హెచ్చరించారు. బుధవారం బ్లూమ్‌బర్గ్‌ టీవీతో ఆయన మాట్లాడుతూ ట్రంప్‌, పుతిన్‌ మధ్య అలాస్కాలో జరగనున్న చర్చలు అనుకూల ఫలితాలు సాధించడంలో విఫలమైన పక్షంలో భారత్‌పై అదనపు సుంకాలు వడ్డించక తప్పదని ఆయన అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అదనంగా సుంకాలు విధించామని, పరిస్థితి తమకు అనుకూలంగా లేకపోతే భారత్‌పై మరోసారి అదనపు సుంకాలు విధించడమో లేదా ఆంక్షలు విధించడమో తమ ప్రభుత్వం చేపడుతుందని స్కాట్‌ హెచ్చరించారు. భారత్‌పై మొదట 25 శాతం సుంకాలు విధించిన అధ్యక్షుడు ట్రంప్‌.. రష్యా నుంచి చమురును, ఆయుధాలను కొనుగోలు చేస్తున్నందుకు మరో 25 శాతం సుంకాలను జరిమానాగా విధించారు.ఉక్రెయిన్‌తో యుద్ధం సాగిస్తున్న రష్యాకు భారత్‌ పరోక్షంగా నిధులు సమకూరుస్తోందని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. అమెరికా విధించిన సుంకాలు మొత్తంగా 50 శాతానికి పెరిగిపోవడాన్ని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇంత భారీ స్థాయిలో సుంకాలు విధించడాన్ని అన్యాయం, అసంబద్ధంగా భారత్‌ అభివర్ణిస్తూ తమ జాతీయ ఇంధన భద్రత కోసం చమురు దిగుమతులు అనివార్యమని సమర్థించుకుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad