Monday, May 5, 2025
Homeరాష్ట్రీయంనేడే నీట్‌

నేడే నీట్‌

- Advertisement -

– పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికారులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) ఆదివారం జరగనుంది. నీట్‌ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో నీట్‌ పరీక్ష నిర్వహణకు 190 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 72,507 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేశారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటలలోపు పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థు లకు అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుంది.
ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా, పరీక్షను ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల వద్ద విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. నీట్‌ పరీక్షా కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉన్నది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్‌ హాజరు విధానం ఉంటుంది. పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని అధికారులు సూచించారు. నీట్‌ పరీక్షకు హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 62 పరీక్షా కేంద్రాలున్నాయి. వాటిలో 26 వేల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -