- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: 79వ స్వాతంత్య దినోత్సవం పురస్కరించుకొని పీఎం మోడీ యువతకు శుభవార్త చెప్పారు.దేశ యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. ప్రైవేటు కంపెనీల్లో కొత్తగా చేరే ఉద్యోగులకు ప్రభుత్వం తరఫున నెలకు రూ.15వేలు అందించనున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన కింద అమలుచేయనున్నామని చెప్పారు. భారత్.. నేడు స్వయంసమృద్ధి దిశగా నడుస్తోంది. ప్రతి రంగంలోనూ స్వయంసమృద్ధి వైపు అడుగులు వేస్తోన్న భారత్, ఎన్ని ఇబ్బందులొచ్చినా వెనకడుగు వేసేదే లేదు’’ అని పీఎం స్పష్టం చేశారు.
- Advertisement -