- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమ బెంగాల్‌లోని బుర్డ్‌వాన్ పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొని 10 మంది మృతి చెందారు. మరో 35 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతులను బీహార్‌లోని చంపారన్ జిల్లా మొటిహరికి చెందినవారిగా గుర్తించారు. మృతుల్లో 8 మంది పురుషులు, ఇద్దరు మహిళలున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులున్నట్లు పోలీసులు గుర్తించారు.
- Advertisement -