నవతెలంగాణ -హైదరాబాద్: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌కు బీసీసీఐ బిగ్ షాకిచ్చింది. ఈ మేరకు అతడిని ఐపీఎల్-2025 సీజన్ కామెంటరీ ప్యానల్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ కొనసాగుతోన్న సమయంలో గ్రౌండ్‌లో ఉన్న ప్లేయర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు మేరకు ఇర్ఫాన్‌పై వేటు వేసినట్లుగా తెలుస్తోంది. అయితే, ఇటీవలే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ భాగంగా కెప్టెన్ రోహిత్ శర్మను పరువు తీశాడనే బీసీసీ దృష్టికి వచ్చింది. రోహిత్ శర్మ యావరేజ్ 6 పరుగులు మాత్రమేనని, తుది జట్టులో అతడికి చాన్స్ కష్టమేనని కామెంట్ చేశారు. అయితే, అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ఇర్ఫాన్ పఠాన్ క్షమాపణలు చెప్పాలని హల్‌చల్ చేశారు. చివరికి విషయం కాస్త బీసీసీఐకి చేరడంతో తాజాగా ఇర్ఫాన్ పఠాన్‌ను ఐపీఎల్-2025 కామెంటరీ ప్యానెల్ నుంచి తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది.
ఇర్ఫాన్ పఠాన్‌కు బీసీసీఐ బిగ్ షాక్…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES